
ఆంధ్రాలో శెట్టి బలిజ పేరుతో రెండు కులాలు ఉన్నాయి
1) శెట్టి బలిజ / బలిజ శెట్టి ( గ్రేటర్ రాయలసీమ ) బలిజ కులానికి ఉప కులం.ఈ రాయలసీమ శెట్టి బలిజలు నిజమైన / పురాతనమైన బలిజలు
2) గోదావరి , గుంటూరు , కృష్ణ జిల్లాలో 1920 లో ediga, ఇండ్ర , సెగడి వంటి కులాలు అమలాపురంలో దొమ్మేటి వెంకట రెడ్డి గౌడ్ చేతులు మీదుగా వీళ్ళ కులానికి కొత్తగా సెట్టి బలిజగా నామకరణం చేసుకున్నారు అది రాను రాను రోజుల్లో శెట్టి బలిజగా మారింది
ముందుగా ఈడిగ కులస్ధులు “సెట్టి బలిజ” అని నామకరణం చేసుకోడానికిగల కారణం ?
దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు కులస్తులను "ఈడిగ" కులస్తులు అంటారు. చరిత్ర మొత్తం అదే చెబుతుంది.. వీరితో సమానమైన కులాలు దక్షిణాదిన "గమళ్లు", "యాతం", "బిల్లవ", "దీవరు", "ఈండ్ర", "సనాన్", "సెగడి", "ఎజువ" వంటి పేర్లతో పిలువబడువారు తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి చోట్ల వున్నారు..
ఇదిలా ఉండగా గోదావరి జిల్లాలలో తరతరాలుగా తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని జీవనం సాగించు "ఈడిగ" కులస్తులు, ఆ ప్రాంతంలోని బ్రాహ్మణ, రాజు, వైశ్య, తెలగ, బలిజ, ఒంటరి, కాపు, కమ్మ, వెలమ వంటి ఇతరకులాలవారిచే తరతరాలుగా చాలా తక్కువ తనంగా నీచంగా చూడబడుతూ ఉండేవారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి రాకతో తీరప్రాంతంలో కూలీలుగా వీరు అధికంగా బర్మా వెళ్లడం జరిగింది అలా వెళ్లినవారిలో కొందరు ఆర్ధికంగా రాజకీయంగా ఎదగడం జరిగింది, అందులో దొమ్మేటి, గుత్తుల వంటి కుటుంబీకులు ముఖ్యులు, బర్మాలో ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎదిగిన వీరిలో "దొమ్మేటి వెంకటరెడ్డి" వంటివారు తమ కులానికి మంచి గుర్తింపుకు, కులం పేరు మార్చాలని నిర్ణయించుకుని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల ఈడిగ కులస్తుల అందరి కలయికతోనూ తాము "చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అమ్ముకుని జీవనం సాగిస్తాము" కాబట్టి చెట్లకు గుర్తుగా చెట్టు, వాటిని అమ్ముకుంటాము కాబట్టి ఆ వ్యాపారానికి గుర్తుగా బలిజ చేర్చి "చెట్టిబలిజ" అనేపేరు తమ నూతన కుల నామంగా పెట్టుకున్నారు. 1920నాటికి ఈ కృష్ణ, గోదావరి, విశాఖ జిల్లాలలో 3 లక్షలమంది ఈడిగ కులస్తులు ఉన్నారు... వీళ్ళ కుల పురాణం "గౌడ పురాణం"
ఈడిగ కులస్తులు - ఇండ్ల పేర్లు (గోదావరి, కృష్ణ, విశాఖ జిల్లాలు)
ఆకులవాళ్ళు, అన్నిబోయినవాళ్లు, అనుసూరి వాళ్ళు, బొక్కావాళ్ళు, బొంతు వాళ్ళు, భైరిశెట్టి వాళ్ళు, చప్పిడి వాళ్ళు, చింతపల్లి వాళ్ళు, చీకట్ల వాళ్ళు, చుట్టూరి వాళ్ళు, చొల్లంగి వాళ్ళు, దంగేటి వాళ్ళు, దాసరి వాళ్ళు, దొంగ వాళ్ళు, దొమ్మేటి వాళ్ళు, ఈరబోయిన వాళ్ళు, గంజ వాళ్ళు, గెద్దాడ వాళ్ళు, గీసాల వాళ్ళు, గోవ్వాల వాళ్ళు, గుబ్బల వాళ్ళు, గూడాల వాళ్ళు, గుత్తుల వాళ్ళు, జుత్తిగ వాళ్ళు, జోగు వాళ్ళు, ఇళ్ల వాళ్ళు, కడలి వాళ్ళు, కట్టా వాళ్ళు, కర్రి వాళ్ళు, కాజు వాళ్ళు, కండిబోయిన వాళ్ళు, కాండ్రేగుల వాళ్ళు, కుడుపూడి వాళ్ళు, కుందూరి వాళ్ళు, కుక్కల వాళ్ళు, కేతా వాళ్ళు, కొప్పిశెట్టి వాళ్ళు, మామిడి వాళ్ళు, మామిడిశెట్టి వాళ్ళు, మేడిశెట్టి వాళ్ళు, మొల్లేటి వాళ్ళు, మోటుపల్లి వాళ్ళు, మురుకుర్తి వాళ్ళు, ముసిని వాళ్ళు, నక్కల వాళ్ళు, నున్నబోయిన వాళ్ళు, పరంశెట్టి వాళ్ళు, పలివెల వాళ్ళు, పాటి వాళ్ళు, పిల్లి వాళ్ళు, పితాని వాళ్ళు, పులపాక వాళ్ళు, పులిదిండి వాళ్ళు, పెచ్చెట్టి వాళ్ళు, రామమోతు వాళ్ళు, రాయుడు వాళ్ళు, రెడ్డి వాళ్ళు, సానబోయిన వాళ్ళు, శీలం వాళ్ళు, సూరంపూడివాళ్ళు, వనచర్ల వాళ్ళు, వాసంశెట్టి వాళ్ళు, వేండ్ర వాళ్ళు, వీరంశెట్టి వాళ్ళు, విత్తనాల వాళ్ళు, యల్లమిల్లి వాళ్ళు, యనమదల వాళ్ళు,
ఆర్డర్: 10/07/1920 డీ. యస్. నేం. 2140 రెవిన్యూ.
1920 సెప్టెంబర్ 25 తేది. తూర్పుగోదవరి జిల్లాలోని అమలాపురం తాలుకాలో బోడసకుర్రులో జరిగిన ఈడిగ కుల సభలో --- "తరతరాలుగా" "ఈడిగ, యీన్ద్ర, యాత" మొదలయిన పేర్లతో పిలువబడే ఈ జాతి "ఇకమీద" "సెట్టిబలిజ" అని పిలువబడాలి. గవర్నమెంట్ లెక్కల్లో గాని, దస్తవేజుల్లో గాని, ఏ రికార్డుల్లో గాని "సెట్టిబలిజ" అని వ్రాయిన్చుకోవాలని "తీర్మానించారు". గ్రామ లెక్కల్లోనూ ఇతరత్రా ఈ కులస్తులను "గాడు" అని వ్యవహరించారాదు. అలా అమర్యదకరరంగా రికార్డులలో వ్రాయకుండా శాసించవలసినదిగా జిల్లా కలెక్టర్ వారికి ఒక మెమొరాండం సమర్పించాలని తీర్మానించారు. ఈ మెమొరాండం అందిన తరువత జిల్లా కలెక్టర్ వారు - జిల్లా, డివిజినల్, తాలూకా ఉద్యోగులుఅందరికి - ఈ సెట్టిబలిజ కులస్థుల పేర్ల చివర "గాడు" అని వ్రాయకూడదని ఆర్డర్ పంపించినారు. ఆర్డర్: 10/07/1920 డీ. యస్. నేం. 2140 రెవిన్యూ.

దానితో మొదటిసారిగా 1920 నాటి ప్రభుత్వ సెన్సస్ రికార్డ్స్ లో "శెట్టిబలిజ" గా నమోదు చేయబడింది. అప్పటినుండి విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ఈడిగ కులస్తులు మాత్రమే తమ కుల నామాన్ని చెట్టిబలిజ లేదా శెట్టి బలిజ అని మార్చుకున్నారు.. మిగతా అన్ని జిల్లాలలోనూ, మరియు ఆంద్ర, తెలంగాణ, రాయలసీమ కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాలలో వీరు అప్పటికీ, నేటికీ ఈడిగలు అనే పిలువబడుతున్నారు
చారిత్రకంగా కాకతీయుల కాలంనుండే ఈడిగ కులస్తుల ప్రస్తావన ఉన్నది. ఈడిగ అంటేనే కల్లు తీసేవాడు అనే అర్ధమే చారిత్రకంగా ఉన్నది. ఈ ఈడిగలకు 100 సంవత్సరాలకు పూర్వం చరిత్రలో ఎక్కడా ఎప్పుడూకూడా శెట్టిబలిజ అనే పేరు లేనే లేదు.. వీళ్ళ కుల వృత్తి తాటి ఈత చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అమ్ముకోవడం, కొబ్బరిచెట్లు ఎక్కి దింపు తీయడం. .... దేశంలో ఎక్కడైనా పురాతనకాలంనుండి వీళ్ళ కుల వృత్తి ఇదే... ఈ వృత్తి కారణంగానే గత కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు BC లుగా రిజర్వేషన్ అనుభవిస్తూ అభివృద్ధి చెందుతున్నారు..అయితే తరవాత వీరి కులస్తులైన సర్దార్ గౌతు లచ్చన్న వంటి పెద్దలు తమకు పురాతనకాలం నుండి ఉన్న "గౌడ పురాణం" ఆధారంగా చేసుకుని "గౌడ కులం"గా పిలువబడాలని పిలుపునిచ్చారు.
ఈడిగ కులస్ధులు కుల పేరు మార్చుకున్నారు అని ఆధారాలు?
1)ఈ phamplet జాగ్రత్త గమనించండి “ స్వాగతం సుస్వాగతం పైన లైనులో ఎం రాసివుందో చూడండి”
2)కులానికి కొత్త పేరు పెట్టుకుని నూఱుయెడ్లు అయినందున ఒక ప్రోగ్రాం కూడా జరుపుకున్నారు
3) 26 - 9 - 1920 నాడు ఈడిగ కులస్ధులు పేరు మార్పు కోసం పిలుపునిచ్చారు ఏకంగా 10 వేల మంది ఈడిగ కులస్ధులు హాజరయ్యి కులానికి కొత్త నామం “సెట్టి బలిజ” అని మార్చుకున్నారు
4) ఈడిగ - గమళ్లు - ఇండ్ర కొత్తగా “ఆర్య హిహిడా “ / “సెట్టి బలిజ” అనే కొత్త పేరుతో నామకరణం చేస్కునున్నారు
5)గోదావరి , కృష్ణ , గుంటూరు జిల్లాలో శెట్టి బలిజ ( ఈడిగా ) అని రాస్తారు. 1920 కుల నామం శెట్టి బలిజ అని మార్చుకున్న ఈడిగ కులస్ధులే
నిజమైన శెట్టి బలిజలు ( వ్యాపార , రాజ్యపాలన ) చేసిన కులము వివరాలు ?
అలాగే 1920 నాటికి నిజమైన మన బలిజవారు లేదా శెట్టిబలిజలు (తెలగ, ఒంటరి, కాపు కాకుండా ఉన్నవారు) అని చెప్పుకునే వారు కూడా ఈ నాలుగు జిల్లాలలో 1 లక్ష 50 వేల మంది ఉన్నారు.... ఈ రోజు గోదావరి వంటి తీరాంధ్ర జిల్లాలలో మన కాపులు అని చెప్పబడుతున్న ఇండ్లపేర్లలో శెట్టి పేరుతొ ఉన్న అబ్బిశెట్టివారు, అక్కిశెట్టివారు , అల్లంశెట్టివారు, అనిసెట్టివారు, బావిశెట్టివారు, బాలిశెట్టివారు, బేతంశెట్టివారు, బొలిశెట్టివారు, బోగిశెట్టివారు, బొప్పిశెట్టివారు, బొమ్మిశెట్టివారు, భైరిశెట్టివారు, చిలపరశెట్టివారు, చెన్నంశెట్టివారు, చలంశెట్టివారు, చిగిలిశెట్టివారు, చిన్నంశెట్టివారు, చోడిశెట్టివారు, ధనిశెట్టివారు, దామిశెట్టివారు, దేశంశెట్టివారు, దేవరశెట్టివారు, దేవిశెట్టివారు, దుగ్గిశెట్టివారు, ఎలిశెట్టివారు, ఎగ్గిశెట్టివారు, గంగిశెట్టివారు, గనిపిశెట్టివారు, గనిశెట్టివారు, గునిశెట్టివారు, గోగిశెట్టివారు, గోపిశెట్టివారు, గోపతిశెట్టివారు, గౌరిశెట్టివారు, ఇమ్మడిశెట్టివారు, జక్కంశెట్టివారు, జామిశెట్టివారు, కలిశెట్టివారు, కామిశెట్టివారు, కాస్సేట్టివారు, కటకంశెట్టివారు, కీర్తిశెట్టివారు, కొలిశెట్టివారు, కొమ్మిశెట్టివారు, కొండిశెట్టివారు, కొప్పిశెట్టివారు, కృష్ణంశెట్టివారు, కూనిశెట్టివారు, కేతిసెట్టివారు, లక్కింశెట్టివారు, లంకిశెట్టివారు, లగ్గిశెట్టివారు, లింగిశెట్టివారు, మదినిశెట్టివారు, మాశెట్టివారు, మద్దిమశెట్టివారు, మంగిశెట్టివారు, మారిశెట్టివారు, మేడిశెట్టివారు, ముమ్మడిశెట్టివారు, ముప్పురిశెట్టివారు, మురహరిశెట్టివారు, ముత్తంశెట్టివారు, నాగిశెట్టివారు, నారిశెట్టివారు, నైనాలశెట్టివారు, నల్లంశెట్టివారు, నరహరిశెట్టివారు, నరాలశెట్టివారు, నుగ్గిశెట్టివారు, నూలిశెట్టివారు, నూరిశెట్టివారు, పాపిశెట్టివారు, పరిమిశెట్టివారు, పెద్దిశెట్టివారు, పేరిశెట్టివారు, పిళ్ళారిశెట్టివారు, పినిశెట్టివారు, పోలిశెట్టివారు, పోసినసెట్టివారు, పోతంశెట్టివారు, రామిశెట్టివారు, రంగిశెట్టివారు, రాయలుశెట్టివారు, సామిశెట్టివారు, సోమిశెట్టివారు, శెట్టివారు, శెట్టిపల్లివారు, సింగంశెట్టివారు, సిరిగిరిశెట్టివారు, శ్రీరాంశెట్టివారు, సూరిశెట్టివారు, తాడిశెట్టివారు, తెలగంశెట్టివారు, తంగిశెట్టివారు, తిక్కిశెట్టివారు, తిప్పిరిశెట్టివారు, తిరుమలశెట్టివారు, వల్లబశెట్టివారు, వల్లంశెట్టివారు, వీరిశెట్టివారు, వేలంశెట్టివారు, వెలిసెట్టివారు, ఉమ్మడిశెట్టివారు, యర్రంశెట్టివారు, యెంగిశెట్టివారు, వంటి 100కు పైగా శెట్టి పేరుతొ ఉన్న ఇంటి పేర్ల వాళ్ళు అందరూ నిజానికి పురాతన కాలంనుండి గొప్ప గొప్ప వ్యాపారాలు చేసిన బలిజలు శెట్టిబలిజలు. ఇంకా శెట్టిపేరుతో లేని అనేక వేల ఇంటిపేర్లు మన అసలు శెట్టిబలిజలకు ఉన్నాయి వీళ్ళు తమపేర్లలో శెట్టి ఉండేలా పెట్టుకునేవారు. వీళ్ళు అందరూ దక్షిణాంధ్ర రాయలసీమలో బలిజలు అని పిలవబడుతున్న, ప్రస్తుతం ఉత్తర ఆంధ్ర ప్రాంతంలో తెలగాలుగా పిలవబడుతూ ఉన్నారు.
నిజమైన శెట్టి బలిజలు పురాతన చరిత్ర
వీరి వద్ద ఉన్న కుల పురాణాల ప్రకారం వీరు, అంధకాసుర అనే రాక్షసుణ్ణి సంహరించడానికి, దేవతల వర ప్రసాదంగా యజ్ఞగుండంలోనుండి పుట్టిన పృధ్విశ్వర అనే యజ్ఞ సంభవుని వంశీయులు. అంధకాసురుని పుర్రెను తక్కెడ తట్టలుగా, వెన్నుపూసను తక్కెడ కోలగా, ప్రేగులను తక్కెడ త్రాళ్లుగా చేసుకుని దాని సహాయంతో దేశదేశాలలోను వాణిజ్యము చేసి జీవించెను. ఈతను కాశీనగరానికి అధిపతిగ ఉండెను. గంధర్వ రాజకన్యను వివాహమాడెను. ఈతనికి 8మంది కుమారులు 2 కుమార్తెలు గలగగా వీరెవ్వరికి సంతానం లేకపోవడంతో దక్షిణాదిన కంచి వచ్చి కామాక్షి అమ్మను ప్రార్ధించగా ఆమె వరప్రసాదం వలన ఈతనికి 24 గురు మనుమలు పుట్టగా వీరందరూ తరువాత వారి వారి వంశాలకు వంశకర్తలు అవడం వలన వీరి సంతతిలో 24 గోత్రాలు ఏర్పడినవి. వీరిలో 16 వంశకర్తలు పురుష సంతతికి చెందినవారు కాగా 8 వంశకర్తలు స్త్రీ సంతతికి చెందినవారు కావడంతో 16 వంశకర్తల గోత్ర సంతతులు 8 వంశ కర్తల గోత్ర సంతతులతో మాత్రమే వైవాహిక సంబంధాలు కలిగి ఉండాలి అనే సంప్రదాయాన్ని తరతరాలుగా అనుసరిస్తూ వచ్చినారు. వీరు నేడు అనేక వందల గృహనామాలతో ఉన్నారు. కంచికామాక్షమ్మ వీరికి ఇలవేలుపు. కంచి ప్రాంతాన్ని 24 వీడులు చేసుకుని పరిపాలన చేసినారు. వీరికి కంచి కామాక్షమ్మ వరప్రసాదులు, కాంచిపుర వరాధీశ్వర అనే బిరుదులు గలవు. వీరికి పృధ్విశెట్టి, పట్టణస్వామి, దేశాయిశెట్టి, దేశాధిపతి, శెట్టి అనే సామాజిక పెద్దలుగా హోదాలు ఉన్నాయి. చోళ రాజుల కాలంలో వ్యాపార ప్రముఖులుగా, సైన్యాధిపతులుగా ఉంటూ, రాజబంధువులుగా ఉంటూ, పాండ్య రాజులతో, చేర రాజులతో, కొంకణ రాజులతో, గుజరాతు దేశం రాజులతో అనేక యుద్దాలు చేసినట్టు వీరి కుల చరిత్రలో వివరాలు గలవు. బలిజ శెట్టి సమయాలకు పెద్దలుగా, కుడిచేయి కులాలన్నింటికీ కుల పెద్దలుగా వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఏ కులంలో తగాదాలు వచ్చినా వీరి తీర్పే అంతిమ తీర్పుగా ఉండేది. అంతటి ధర్మ నిరతులు వీరు. దీనికి సంబందించిన శాసనం కంచి లో ఉన్నదని తెలుస్తుంది. మంత్రి మహానాడు బలిజ సమయంలో కులాల కుల కట్టుబాట్లు నిర్ణయించి, అమలు జరిపేవారు. వర్ణాశ్రమ ధర్మాలు అతిక్రమణ జరగకుండా కాపాడేవారు. కంచి ప్రాంతంనుండి ఈ శెట్టిబలిజ తెగవారు తరతరాలుగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప్రాంతాలకు విస్తరిస్తూ వచ్చెను.
18వ శతాబ్దంలో కల్నల్ మెకంజీ అనే బ్రిటిష్ అధికారి సేకరించిన అనేక వేల తాళపత్ర గ్రంధాలలో వీరికి సంబందించిన వంశ చరిత్రలు కుల గాధలు - వలంగై ఇడంగై వరలారు వంటివి మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ, లండన్ బ్రిటిష్ లైబ్రరీ, కలకత్తా లైబ్రరీ వంటి చోట్ల భద్రపరచబడి ఉన్నాయి.
ఉదాహరణకు శెట్టి బలిజ కులానికి చెందిన తిమ్మమ్మ అమ్మవారు , నిజమైన శెట్టి బలిజ కులానికి చేసినవారే , క్రింద ఫోటో చూడండి
600 సంవత్సరాల క్రితం శెట్టిబలిజ తిమ్మమ్మ గారు బలిజ కులస్ధులు , దీని బట్టి కూడా చెప్పవచ్చు పురాతనమైన శెట్టి బలిజలు నేడు రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నవారే , కానీ 1920 లో కుల నామం మార్చుకున్న ఈడిగ కులస్ధులు కాదు.
Publishing these kind of nonsense just caste terrorism we are in advanced age be human be in frontline to patronise human values
ReplyDelete